Tuesday, February 27, 2024

GaganYan Project: 'గ‌గ‌న్ యాన్‌' ద్వారా అంత‌రిక్షంలోకి వెళ్లే వ్యోమ‌గాములు వీరే: ప్ర‌ధాని మోడీ వెల్ల‌డి......


`న్ యాన్‌` భార అంతరిక్ష రిశోధ సంస్థ చేపట్టనున్న ప్రయోగం ఇది. దీని ద్వారా వ్యోమగాములను భారత్ తొలిసారి అంతరిక్షంలోకి పంపించనుంది. ప్రధాని రేంద్ర మోడీ దీనిపై తాజా ప్ర చేశారు


`గ‌గ‌న్ యాన్‌` ద్వారా అంత‌రిక్షంలోకి వెళ్లే వ్యోమ‌గాములు వీరే


'Gagan Yan` News: అంత‌రిక్ష రంగం(Space)లో ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న భార‌త్(India) స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని నిల‌బ‌డుతున్న విష‌యం తెలిసిందే. అనేక ప్ర‌యోగాల్లో భార‌త్.. అమెరికా(America), చైనా(China) స‌హా ప‌లు దేశాల‌కు దీటుగా దూసుకుపోతోంది. చంద్ర‌యాన్‌(Chandrayan).. వంటి కీల‌క ప్ర‌యోగాల‌తో ప్ర‌పంచ దేశాల దృష్టిని ఆక‌ర్షించింది. అయితే.. మాన‌వులను అంత‌రిక్షంలోకి పంపించ‌డం అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌కు సాధ్యం కాలేదు. ఈ నేప‌థ్యంలో గ‌త మూడేళ్లుగా భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ(Indian Space Research Organigation-ISRO) ఆ దిశ‌గా దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలో  మిష‌న్‌ `గ‌గ‌న్‌యాన్‌`(Gaganyan) ను ప్ర‌క‌టించింది. దీనికి కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాదిన్న‌ర కింద‌టే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో యుద్ధ ప్రాతిప‌దికన ఇస్రో త‌న వ్యూహాన్ని కార్యాచ‌ర‌ణ‌లోకి తీసుకువ‌చ్చింది. ఈ ప్ర‌యోగం వాస్త‌వానికి ఈ ఏడాది చివ‌రి నాటికే చేప‌ట్టాల్సి ఉంది. అయితే.. కొన్ని కార‌ణాల‌తో దీన్ని వ‌చ్చే ఏడాదికి వాయిదా వేశారు. 

తాజాగా ఏం జ‌రిగింది? 

దేశం స‌గ‌ర్వంగా భావిస్తున్న గ‌గ‌న్‌యాన్(Gagan Yan) ప్ర‌యోగం ద్వారా.. అంత‌రిక్షంలోకి వెళ్లే.. వ్యోమ‌గాముల‌ను ఇప్ప‌టికే ఎంపిక చేశారు. తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) వారి పేర్ల‌ను ప్ర‌క‌టించారు. కేర‌ళ‌లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాని మోడీ.. తిరువనంతపురం(Tiruvanantapuram)లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వారిని పరిచయం చేస్తూ.. స్టాండింగ్ ఒవేషన్‌తో సత్కరించారు. 

ఆ నలుగురూ వీరే 

1) ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌
2) అంగద్‌ ప్రతాప్‌
3) అజిత్ కృష్ణన్‌ 
4) వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లాలు వ్యోమనౌక(Vehicle)లో అంత‌రిక్షంలోకి వెళ్లనున్నారు. వీరంతా కూడా భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు కావ‌డం, సుదీర్ఘ అనుభ‌వం(12 సంవ‌త్స‌రాల పైబ‌డి) ఉండ‌డంతో వీరిని అన్ని కోణాల్లోనూ ప‌రీక్షించి ఎంపిక చేశారు. వీరి పేర్ల‌ను తాజాగా ప్ర‌ధాని మోదీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కాగా, భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. 

'140 కోట్ల మంది ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపం'

తిరువ‌నంత పురంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ మాట్లాడారు. ‘విక్రమ్ సారాభాయ్‌ స్పేస్ సెంటర్ నుంచి మరొక చరిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నాం. ఈ రోజు నలుగురు వ్యోమగాములు భారత్‌కు పరిచయమయ్యారు. ఇవి నాలుగు పేర్లు కాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. అయితే ఈసారి కౌంట్‌డౌన్‌ మనదే. రాకెట్ మనదే’ అంటూ ప్రధాని వారిని కొనియాడారు. ఇక, మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతున్న తరుణంలో.. గగన్‌యాన్‌ మన అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుందని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో భారత `నారీ శక్తి` కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్‌, గగన్‌యాన్‌ వంటి మిషన్‌లను ఊహించుకోలేమన్నారు. ఇదిలావుంటే.. భార‌త అంత‌రిక్ష రంగంలో 100 శాతం విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌కు అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఇలాంటి ప్ర‌యోగాలు మ‌రిన్ని పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. 

ర‌ష్యా శిక్ష‌ణ‌లో.. 

భార‌త్ నుంచి అంత‌రిక్షంలోకి వెళ్ల‌నున్న న‌లుగురు వ్యోమ‌గాముల‌కు కొద్దికాలం రష్యాలో శిక్షణ ఇచ్చారు.  ISROతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ వారిని సుశిక్షితులను చేసింది. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని మ‌రింత‌గా తీర్చిదిద్దుతోంది. 2025లో జరిగే ఈ యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. వారిని రోదసిలోకి పంపి, మూడు రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ యాత్రలో కీలకాంశమని తెలిపారు. ఈ మిషన్ సాంతం వారు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు.  

గ‌తంలోనూ..

గతంలో కూడా  రాకేశ్‌శర్మ భారత్‌ తరఫున అంతరిక్షంలోకి వెళ్లారు. క్షేమంగా తిరిగి వ‌చ్చారు.అంతేకాదు..  భార‌త్ నుంచి అంత‌రిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సాధించారు. కానీ, ఆయ‌న భార‌తీయుడే అయినా.. ఆయ‌న పాల్గొన్న ప్ర‌యోగం.. మాత్రం  ర‌ష్యా చేప‌ట్టింది. అప్ప‌ట్లో భార‌త్ అనుమతి మేర‌కు రాకేశ్ శ‌ర్మ అంత‌రిక్షానికి వెళ్లి వ‌చ్చారు.  కానీ, ఇప్పుడు తొలిసారి భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ చేప‌ట్టిన యాత్రద్వారా.. భారతీయులు వెళ్తుండ‌డం గ‌మ‌నార్హం. 

No comments:

Post a Comment