Wednesday, March 2, 2022

ఏకంగా 500 మిలియన్స్‌తో కనీవినీ ఎరుగని రికార్డు - చరిత్ర సృష్టించిన బంగార్రాజు మూవీ

కొన్నేళ్ల క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' మూవీ తర్వాత హిట్లను అందుకోవడంలో విఫలం అవుతున్నా.. వరుస పెట్టి ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాడు టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున. ఈ గ్యాప్‌లో ఆయన ఎన్నో వైవిధ్యమైన కథలతో మూవీలు చేశాడు. కానీ, అవేమీ సక్సెస్ ట్రాక్‌ను మాత్రం ఎక్కించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం 'బంగార్రాజు' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కినేని నాగ చైతన్య కూడా నటించిన ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. దీంతో ఈ సినిమా హిట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీ మరో కనీవినీ ఎరుగని రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలు మీకోసం!


సంక్రాంతి బరిలో బంగార్రాజు
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్ కృ😫💇ష్ణ కురసాల రూపొందించిన సినిమానే 'బంగార్రాజు'. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది.


టాక్ ఉన్నా కష్టాలు వచ్చాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బంగార్రాజు' మూవీకి ఆరంభం నుంచే మంచి టాక్ వచ్చింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యూ, నైట్ కర్ఫ్యూతో పాటు యాభై శాతం ఆక్యూపెన్సీ ఉండడంతో ఇది కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో నైజాంలో మంచిగా వసూళ్లను సాధించినా.. ఆంధ్రాలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.


ఎట్టకేలకు టార్గెట్ పూర్తి చేసి


భారీ బడ్జెట్‌తో రూపొందిన 'బంగార్రాజు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నెల రోజుల తర్వాత ఈ మూవీ టార్గెట్ చేరుకుని హిట్ అయింది. దీంతో నాగార్జున సక్సెస్ ట్రాక్ ఎక్కగా.. చైతూ మరో హిట్‌ను అందుకున్నాడు.





ఈ ఏడాది ఫస్ట్ హిట్‌గా నిలిచి

కరోనా ప్రభావం పెరిగిన కారణంగా ఈ సంక్రాంతికి పెద్దగా సినిమాలు రాలేదు. వచ్చిన వాటిలో 'బంగార్రాజు' మాత్రమే భారీ చిత్రం. అందుకే ఈ చిత్రానికి బిజినెస్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా టార్గెట్‌ను ఫినీష్ చేసి సత్తా చాటింది. దీంతో 2022వ సంవత్సరంలో హిట్ అయిన మొదటి చిత్రంగా ఇది ఘనతను సాధించింది.


ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెస్పాన్స్

సంక్రాంతి కానుకగా వచ్చిన 'బంగార్రాజు' మూవీ థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. ఇక, ఇటీవలే ఈ సినిమా అందులో డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అక్కడ కూడా ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది.

చరిత్ర సృష్టించిన సినిమా

'బంగార్రాజు' మూవీకి జీ5లోనూ దీనికి భారీ స్పందనే దక్కుతోంది. దీంతో 24 గంటల వ్యవధిలోనే ఎక్కువ వ్యూస్‌ను అందుకుంది. తద్వారా అందులో ఎక్కువ క్లిక్స్ సంపాదించుకున్న ఏకైక సినిమా అరుదైన రికార్డును నమోదు చేసింది. ఇక, ఇప్పుడు ఇది 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసింది. తద్వారా జీ5లో ఈ ఘనత అందుకున్న ఏకైక సినిమా చరిత్ర సృష్టించింది.

Source Filmybeat

1 comment: