Tuesday, February 27, 2024

షారుఖ్ ఖాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జాన్ సీనా.. కారణమేంటో తెలుసా?

 

ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్స్‌ జాన్‌ సీనాకు భారతదేశం అంటే ప్రత్యేకమైన ప్రేమ. అతను తరచుగా భారతీయులు, ఆచార వ్యవహారాల గురించి మాట్లాడుతుంటాడు. అలాగే భారతీయ సినిమాల గురించి పోస్ట్ చేస్తాడు. తాజాగా ఆయన షారుఖ్‌ ఖాన్‌పై ఓ పాట పాడారు. ఈ వీడియో చూసిన కింగ్ ఖాన్‌ సోషల్ మీడియా వేదికగా జాన్ సీనాకు..




ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్స్‌ జాన్‌ సీనాకు భారతదేశం అంటే ప్రత్యేకమైన ప్రేమ. అతను తరచుగా భారతీయులు, ఆచార వ్యవహారాల గురించి మాట్లాడుతుంటాడు. అలాగే భారతీయ సినిమాల గురించి పోస్ట్ చేస్తాడు. తాజాగా ఆయన షారుఖ్‌ ఖాన్‌పై ఓ పాట పాడారు. ఈ వీడియో చూసిన కింగ్ ఖాన్‌ సోషల్ మీడియా వేదికగా జాన్ సీనాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు తన లేటెస్ట్ పాటలను వారికి పంపుతామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై జాన్ సీనా కూడా వెంటనే స్పందించారు. ‘మీ సినిమాలతో ప్రపంచంలో ఎంతో మందిని సంతోష పరుస్తున్నారు. మీరు చేస్తున్న పనికి థ్యాంక్స్ సార్ ‘ అంటూ రిప్లై ఇచ్చారు జాన్ సీనా. ప్రస్తుతం ఈ సూపర్ స్టార్స్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇటీవల జాన్ సీనా జిమ్‌లో షారుక్ ఖాన్ ‘దిల్ తో పాగల్ హై’ సినిమాలోని ‘బోలి సి సూరత్..’ పాడటానికి ప్రయత్నించాడు. అతనికి భారతీయ మల్లయోధుడు ఈ పాటను నేర్పించాడు. ఈ వీడియో చూసి షారూఖ్ చాలా సంతోషించాడు. సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. ‘ ఇద్దరికీ ధన్యవాదాలు. నాకు అది నచ్చింది. లవ్ యు జాన్ సీనా. నేను నా లేటెస్ట్ పాటలను కూడా పంపుతున్నాను. మీరిద్దరూ పాడాలి’ అని షారుఖ్ అభ్యర్థించాడు. ఈ ట్వీట్ ను చూసిన జాన్ సీనా కూడా వెంటనే షారుక్ కు రిప్లై ఇచ్చాడు. తన సినిమాలతో ఎంతోమందిని సంతోష పరుస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాడు.


ఇక సినిమాల విషయానికి వస్తే.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ తో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు షారుఖ్ ఖాన్. కింగ్ ఖాన్ నటించిన’పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ బ్లాక్ బస్టర్స్‌ మూవీస్‌ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. దీంతో షారుక్‌ తదుపరి సినిమాల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి షారుక్‌ అప్ డేట్స్ ఇచ్చే అవకాశముంది.



No comments:

Post a Comment