MA Entertainments

టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’ అంచనాలకు మించి ఆడిన సంగతి తెలిసిందే. ఊహించిన దానికంటే గట్టిగానే కలెక్షన్ల వర్షం సైతం కురిసింది. గ్యాప్ తీసుకున్నప్పటికీ సంక్రాంతికి వచ్చిన బన్నీ అదరగొట్టేశాడు. కాగా.. ఈ సినిమాకు సంబంధించి పాటల రిలీజ్ మొదలుకుని సినిమా విడుదలై ఇన్ని రోజులవుతున్నా.. అటు నెట్టింట్లో.. ఇటు యూట్యూబ్‌లో మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో రింగ్ టోన్స్, పాటలు మార్మోగుతున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఈ పాటలకు డ్యాన్స్ వేస్తున్నారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ‘సామజవరగమణ’, ‘రాములో రాములా..’ ఈ పాటలు ఏ రేంజ్‌లో ఆదరణ పొందాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.
యమా క్రేజ్!
             ఇప్పటికే ‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే’ అనే ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. అయితే తాజాగా.. ‘రాములో రాములా...’ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసారు. ఈ పాటను శ్యామ్ కాసర్ల రాయగా.. థమన్ అద్బుతమైన ట్యూన్ అందించాడని చెప్పుకోవచ్చు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఈ పాటకు గాత్రం అందించారు. ఈ పాటలో అల్లు అర్జున్ స్టెప్పులు మాస్‌ను కిక్ ఎక్కించి.. జనాలు థియేటర్లకు క్యూ కట్టేలా చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన రెండు గంటల్లోనే 185,212 వ్యూస్ వచ్చాయి. 66వేల లైక్స్ రాగా.. డిస్‌లైక్స్ కూడా వచ్చాయి. మరోవైపు.. మెగాభిమానులు, బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

No comments:

Post a Comment