Thursday, July 25, 2024

'మీకు దండం బాబూ ఒక్క రూపాయీ లేదు' - సీసీ కెమెరా ముందు దొంగ సైగలు, పెర్ఫార్మెన్స్ అదుర్స్ ఏమీ దొరక్క రూ.20 పెట్టి, సీసీ కెమెరాకు దండం పెట్టిన దొంగ...

Rangareddy News: ఓ దొంగ పక్కా ప్లాన్‌తో ఓ హోటల్‌లో చోరీకి వెళ్లాడు. అయితే, అక్కడ ఒక్క రూపాయి కూడా దొరక్క సీసీ కెమెరాల ముందు విచిత్రంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


Strange Thief Expressions Infront Of Cameras In Maheswaram: ఓ వ్యక్తి హోటల్‌లో చోరీ చేసేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యాడు. పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక్కూడదనే ఉద్దేశంతో ముఖానికి మంకీ క్యాప్, చేతులకు గ్లౌజ్ ధరించి మొత్తానికి స్పాట్ వద్దకు చేరుకున్నాడు. సీరియస్‌గా చాకచక్యంగా తాళం పగలగొట్టిన దొంగ చాలాసేపు అక్కడ వెతికినా ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురై సీసీ కెమెరా ముందు విచిత్రమైన హావభావాలు ప్రదర్శించాడు. రంగారెడ్డి (Rangareddy) జిల్లా మహేశ్వరంలో (Maheswaram) ఈ ఘటన జరగ్గా.. సదరు దొంగ సీసీ కెమెరాల ముందు చేసిన  ఫెర్మార్మెన్స్ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.


రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందున్న ఓ హోటల్‌లో దొంగ చోరీ చేసేందుకు ముఖానికి మంకీ క్యాప్, చేతులకు గ్లౌజులతో సిద్ధమయ్యాడు. పకడ్బందీగా స్పాట్‌కు వెళ్లి పని కానిచ్చేద్దాం అనుకున్నాడు. తీరా తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చాలాసేపు వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా దొరకలేదు. తీవ్ర నిరాశకు గురైన సదరు దొంగ సీసీ కెమెరాల ముందు విచిత్రంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. 'ఏం సామీ మీకు దండం. ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఇంటికి వెళ్లేటప్పుడు హోటల్ యజమాని ఓ పదో పరకో పెట్టి వెళ్లకపోతే ఎలా.?' అన్న రీతిలో కెమెరాల ముందు హావభావాలు ప్రదర్శించాడు. అంతే కాకుండా ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ తీస్తూ.. 'ఇది తప్ప ఇంకే దొరకలేదు' అన్న రీతిలో కెమెరా ముందు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. మళ్లీ తిరిగి వచ్చి టేబుల్‌పై రూ.20 పెట్టి 'ఇదుగో వాటర్ బాటిల్ డబ్బులు కూడా పెట్టి వెళ్లిపోతున్నా'  అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సినిమాల్లో కమెడియన్లను మించిన పెర్ఫార్మెన్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ తెగ నవ్వుకుంటున్నారు.


Source From - https://telugu.abplive.com/

Tuesday, June 25, 2024

AP TET 2024 Results : ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి...

 ఏపీ టెట్ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.

https://manugroup.blogspot.com/p/ma-news.html

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు (AP TET Results) విడుదలయ్యాయి. క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.


ఫలితాల కోసం క్లిక్ చేయండి

Saturday, June 1, 2024

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు Hanuman Jayanthi 2024 Wishes in Telugu

 Hanuman Jayanthi 2024 Wishes in Telugu :

  • "వాయుపుత్రుడిలా మీరు కూడా మీ రంగంలో వాయు వేగంతో విజయం వైపు దూసుకెళ్లాలని ఆశిస్తూ.. హ్యాపీ హనుమాన్ జయంతి!"
  • "మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. వాటన్నింటినీ హనుమంతుడు లంకను దహనం చేసినట్టుగా బూడిద చేయాలని, ఆ శక్తిని మీకు ఆంజనేయుడు ప్రసాదించాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు"
  • "మారుతిలా దృఢనిచ్చయంతో ముందుకు సాగుతూ మీ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!"
  • "ఈ హనుమాన్ జయంతి రోజున.. ఆంజనేయస్వామి అనుగ్రహం లభించి మీరు ప్రత్యేకమైన శక్తిని పొందాలని కోరుకుంటూ.. హ్యాపీ హనుమాన్ జయంతి!"
  • "తన శక్తి యుక్తులతో ఎక్కడుందో కూడా తెలియని సీతమ్మ జాడ కనుగొన్నాడు మారుతి. మీరు కూడా అంతటి శక్తి సామర్థ్యాలతో జీవితాన్ని గెలవాలని కోరుకుంటూ హ్యాపీ హనుమాన్ జయంతి!"
  • "ఈ పవిత్రమైన హనుమాన్ జయంతి రోజున.. మీ కల నెరవేరాలని, కుటుంబం సురక్షితంగా, సంతోషంగా ఉండాలని మనసారా ఆశిస్తూ.. బంధుమిత్రులందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి!"
  • "ఆంజనేయస్వామి అనుగ్రహంతో.. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలని ఆశిస్తూ.. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!"
  • "శ్రీరాముడి మనసులో హనుమంతుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇదేవిదంగా.. ఆంజనేయుడి హృదయంలో మీకు స్థానం లభించాలని ఆకాంక్షిస్తున్నా - హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!"
  • "ఈ పవిత్రమైన రోజున పవనసుతుడు.. మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!"




Saturday, April 13, 2024

మీ ఇంట్లో AC వినియోగిస్తున్నారా... అయితే విద్యుత్‌ ఛార్జీలను ఎలా తగ్గించుకోవాలో తెలుసా??

వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు కారణంగా వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది ఇళ్లు, కార్యాలయాల్లో AC (ఎయిర్‌ కండిషనర్‌) వినియోగం అధికం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువ గంటలపాటు AC ఆన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ ఛార్జీలు కూడా అధికంగా వస్తాయి.


అయితే గతంతో పోలిస్తే పట్టణాల్లో, నగరాల్లో ఏసీల వినియోగం ఎక్కువైంది. ఈ పరిస్థితి గ్రామాల్లోనూ కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏసీల వినియోగం ఎక్కువగా ఉంటోంది. దీంతో మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువ విద్యుత్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించవచ్చు.


క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించాల్సి ఉంటుంది : ఇంట్లో లేదా కార్యాలయాల్లో వినియోగించే AC లను క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించాల్సి ఉంటుంది. ఫలితంగా ఏసీ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతోపాటు ఏసీ ఫిల్టర్లను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయించాల్సి ఉంటుంది. ఫలితంగా అక్కడ దుమ్ము, దూళి చేరేందుకు అవకాశం ఉండదు. ఏసీ ఫిల్టర్‌ సహా ఇతర సమస్యలు ఉండే ఎయిర్‌ కండిషనర్‌ సక్రమందా పనిచేసేందుకు ఎక్కువ విద్యుత్‌ అవసరం అవుతుంది. అదే ఇలాంటి సమస్యలను క్రమం తప్పకుండా పరిష్కరిస్తే ఏసీ పనిచేసేందుకు ఎక్కువ విద్యుత్‌ అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్‌ ఆదా అవుతుంది.


కిటీకీలు మరియు డోర్లు మూసి వేయాలి : ఏసీ వినియోగిస్తున్న సమయంలో ఇంట్లోని కిటికీలు, తలుపులు మూసి వేయాల్సి ఉంటుంది. ఇవి తెరిచి ఉంటే ఇంటిని చల్లగా ఉంచేందుకు ఎయిర్‌ కండిషనర్‌కు ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. దీంతోపాటు చల్లని గాలి బయటకు వెళ్లకుండా కర్టెన్‌లు వంటివి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది.


24 గంటలు వినియోగించవద్దు.. : ఇంట్లోని AC లను 24 గంటలపాటు నిరంతరం ఉపయోగించకూడదు. ఇలా చేస్తే పరికరాలు వేగంగా డ్యామేజీ కావడంతోపాటు విద్యుత్‌ ఛార్జీలు అధికంగా వస్తాయి. అందువల్ల AC లకు టైమర్‌ను ఏర్పాటుచేసి ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అయ్యేలా చూడాలి. దీంతోపాటు కొందరి ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ AC లను వినియోగిస్తుంటారు. అయితే అన్నింటిని ఒకేసారి వినియోగించడం వల్ల ఎక్కువ విద్యుత్‌ వినియోగం జరుగుతుంది. ఫలితంగా నెలవారీ విద్యుత్‌ ఛార్జీలు అధికంగా వస్తాయి. అందరూ ఒకేసారి AC లు వినియోగించకపోవడం ఉత్తమం. Public Wi-Fi పబ్లిక్‌ వైఫైని ఎక్కువగా వినియోగిస్తున్నారా.. ఇలా చేయకుంటే డేంజర్‌లో ఉన్నట్టే..!! 



ఫ్యాన్‌ వినియోగం : ఎయిర్‌ కండిషనింగ్ ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా గది మొత్తం వ్యాపించేలా చిన్న ఫ్యాన్‌ ను వినియోగించవచ్చు. దీంతోపాటు ఎయిర్‌ కండిషనర్‌ను గదిని అత్యంత చల్లగా చేసేందుకు కాకుండా ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రత వద్ద వినియోగించడం అలవాటు చేసుకోండి. దీంతోపాటు తక్కువ విద్యుత్‌ వినియోగించి, సమర్థవంతంగా పనిచేసే ACలను కొనుగోలు చేయడం ఉత్తమం. అధిక స్టార్‌ రేటింగ్‌లు ఉన్న AC లు తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. దీంతోపాటు మీకు ఎక్కువ కాలం పాటు ఒకే ACని వినియోగిస్తుంటే, దాని స్థానంలో కొత్తది కొనుగోలు చేయడం ఉత్తమం. అయితే ప్రతిసారి కొత్తది కొనుగోలు చేసేందుకు సాధ్యం కాదు. అయితే ఎక్కువ సమస్యలున్న AC ని అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

 

Thursday, April 11, 2024

ఈద్-ఉల్-ఫితర్ ఉపవాస దీక్షలు ముగించి పండగను జరుపుకుంటున్న మస్లిం సోదరులందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు  
M.Mahesh