వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు కారణంగా వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది ఇళ్లు, కార్యాలయాల్లో AC (ఎయిర్ కండిషనర్) వినియోగం అధికం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువ గంటలపాటు AC ఆన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు కూడా అధికంగా వస్తాయి.
అయితే గతంతో పోలిస్తే పట్టణాల్లో, నగరాల్లో ఏసీల వినియోగం ఎక్కువైంది. ఈ పరిస్థితి గ్రామాల్లోనూ కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏసీల వినియోగం ఎక్కువగా ఉంటోంది. దీంతో మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువ విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు.
క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది : ఇంట్లో లేదా కార్యాలయాల్లో వినియోగించే AC లను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. ఫలితంగా ఏసీ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతోపాటు ఏసీ ఫిల్టర్లను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయించాల్సి ఉంటుంది. ఫలితంగా అక్కడ దుమ్ము, దూళి చేరేందుకు అవకాశం ఉండదు. ఏసీ ఫిల్టర్ సహా ఇతర సమస్యలు ఉండే ఎయిర్ కండిషనర్ సక్రమందా పనిచేసేందుకు ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. అదే ఇలాంటి సమస్యలను క్రమం తప్పకుండా పరిష్కరిస్తే ఏసీ పనిచేసేందుకు ఎక్కువ విద్యుత్ అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది.
కిటీకీలు మరియు డోర్లు మూసి వేయాలి : ఏసీ వినియోగిస్తున్న సమయంలో ఇంట్లోని కిటికీలు, తలుపులు మూసి వేయాల్సి ఉంటుంది. ఇవి తెరిచి ఉంటే ఇంటిని చల్లగా ఉంచేందుకు ఎయిర్ కండిషనర్‌కు ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. దీంతోపాటు చల్లని గాలి బయటకు వెళ్లకుండా కర్టెన్‌లు వంటివి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
24 గంటలు వినియోగించవద్దు.. : ఇంట్లోని AC లను 24 గంటలపాటు నిరంతరం ఉపయోగించకూడదు. ఇలా చేస్తే పరికరాలు వేగంగా డ్యామేజీ కావడంతోపాటు విద్యుత్ ఛార్జీలు అధికంగా వస్తాయి. అందువల్ల AC లకు టైమర్‌ను ఏర్పాటుచేసి ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా చూడాలి. దీంతోపాటు కొందరి ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ AC లను వినియోగిస్తుంటారు. అయితే అన్నింటిని ఒకేసారి వినియోగించడం వల్ల ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఫలితంగా నెలవారీ విద్యుత్ ఛార్జీలు అధికంగా వస్తాయి. అందరూ ఒకేసారి AC లు వినియోగించకపోవడం ఉత్తమం. Public Wi-Fi పబ్లిక్ వైఫైని ఎక్కువగా వినియోగిస్తున్నారా.. ఇలా చేయకుంటే డేంజర్‌లో ఉన్నట్టే..!!
ఫ్యాన్ వినియోగం : ఎయిర్ కండిషనింగ్ ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా గది మొత్తం వ్యాపించేలా చిన్న ఫ్యాన్ ను వినియోగించవచ్చు. దీంతోపాటు ఎయిర్ కండిషనర్‌ను గదిని అత్యంత చల్లగా చేసేందుకు కాకుండా ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రత వద్ద వినియోగించడం అలవాటు చేసుకోండి. దీంతోపాటు తక్కువ విద్యుత్ వినియోగించి, సమర్థవంతంగా పనిచేసే ACలను కొనుగోలు చేయడం ఉత్తమం. అధిక స్టార్ రేటింగ్‌లు ఉన్న AC లు తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. దీంతోపాటు మీకు ఎక్కువ కాలం పాటు ఒకే ACని వినియోగిస్తుంటే, దాని స్థానంలో కొత్తది కొనుగోలు చేయడం ఉత్తమం. అయితే ప్రతిసారి కొత్తది కొనుగోలు చేసేందుకు సాధ్యం కాదు. అయితే ఎక్కువ సమస్యలున్న AC ని అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment