Podcasts, interviews, videos, and photo galleries covering the latest entertainment news in India and around the world. health, beauty, fashion. Live TV Channels | Online TV Shows | Indian TV Serials
Wednesday, August 28, 2024
హీరో హోండాను ఎవరు డిజైన్ చేశారో, ఎలా డిజైన్ చేశారో, అతని పేరు ఏమిటో తెలుసా ........?
1938 లో టోక్యో నగరంలో ఒక కుర్రాడు సొంతంగా కార్ల పిస్టన్ రింగ్ లు తయారుచేసాడు అతి కష్టం మీద TAYOTA కంపెనీ వాళ్ళ అపాయింట్ తీసుకొని టయోటా కంపెనీ ఇంజనీర్ లకు చూపించాడు వారు ఆ రింగ్ లను మెచ్చుకొని నీకు పిస్టన్ రింగ్ ల కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కనీసం ఆటోమొబైల్ డిప్లొమా ఉండాలి అని అన్నారు. అతను నిరాశ చెందకుండా ఆటోమొబైల్ డిప్లొమా పూర్తి చేసి టయోటా కంపెనీ పిస్టన్ రింగ్ ల కాంట్రాక్ట్ పొందాడు. ఆ కాంట్రాక్ట్ కాగితం చూపించి బ్యాంక్ లో అప్పు తీసుకొని పిస్టన్ రింగ్ లు తయారు చేసే పరిశ్రమని నిర్మించడం మొదలుపెట్టాడు. 95% ఫెక్టరీ పూర్తి అయిన సమయంలో 2వ ప్రపంచ యుద్ధం వచ్చి అనుకోకుండా యుద్ధ బాంబు ఒకటి ఫ్యాక్టరీ పై పడి మొత్తం బూడిద అయ్యిపోయింది. ఆ కుర్రాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే తేరుకొని బ్యాంక్ కి వెళ్లి తన పరిస్థితి వివరించి మళ్ళీ కొంత లోన్ కావాలని ప్రాధేయపడ్డాడు బ్యాంక్ మేనేజర్ ససేమిరా లోన్ ఇవ్వడం కుదరదు అన్నాడు. చేసేది ఏమి లేక తన మిత్రుల వద్దకు వెళ్లి టయోటా కంపెనీ కాంట్రాక్ట్ కాగితం చూపించి మిత్రులందరి వద్దా.. కొంత మొత్తం అప్పుగా తీసుకొని కూలిపోయిన మళ్ళీ ఫ్యాక్టరీ పునఃప్రారంభించాడు. ఈసారి 95% ఫ్యాక్టరీ పూర్తి అయింది. భూకంపాలు సర్వసాధారణం అయిన అదేశంలో ఓ భూకంపం ఈ కుర్రవాడి ఫ్యాక్టరీ ని పూర్తిగా మట్టికరిపించింది. దెబ్బకు ఆ కుర్రాడికి 25 ఏళ్లకే ముసలి తనం వచ్చేసింది. వెంటనే తన స్నేహితులను, ,బ్యాంక్ వారిని కలసి తన గోడును వెళ్లగక్కి వాళ్ళ అప్పులని తప్పక తీరుస్తానని చెప్పాడు ఇతని వద్ద ఏమి లేకపోవడం వలన వాళ్ళు కూడా చేసేదేమీ లేక ఊరుకున్నారు. ఖరీదైన టోక్యో డబ్బు లేకపోవడం తో నివసించడం కష్టంగా ఉండి దగ్గరలో వుండే గ్రామానికి ఆ కుర్రాడు మకాం మార్చాడు. ఆ గ్రామం నుండి నగరానికి రోజు సైకిల్ మీద వస్తూ పట్టణం లో ఒక మెకానిక్ గ్యారేజ్ లో పనికి కుదిరాడు. రోజు గ్రామం నుండి పట్టణానికి సైకిల్ తొక్కలేక తన ఆటోమొబైల్ పరిజ్ఞానంతో ఒక మోటార్ తయారుచేసి సైకిల్ కి అమర్చి తొక్కనవసరం లేకుండా సైకిల్ పై రోజు పట్టణానికి వచ్చేవాడు. అది చూసి ఆ గ్రామంలో పిల్లలు అందరూ తమకి అలాంటి మోటార్ సైకిల్ కావాలని తల్లిదండ్రుల వద్ద పేచీ పెట్టారు. ఇక ఆ పిల్లల తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఆకుర్రవాడు మోటార్ సైకిల్ ళ్లు తయారుచేయడం ప్రారంభించాడు. అలా ఉద్భవించిందే హోండా మోటార్ సైకిల్ . ప్రపంచపు నెంబర్ 1 మోటార్ సైకిల్ గా పేరు గాంచిన HERO HONDA మోటార్ సైకిల్ డిజైన్ అతనిదే అతని పేరే హోండా.. ఆ హోండా కంపెనీ జపాన్ కార్ల కంపెనీ TAYOTA కి మంచి పోటీ ఇస్తుంది.
Inspiring
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment