Tuesday, March 24, 2020

Covid-19 Hospital: కరోనా పేషెంట్లకు ఇండియాలోనే మొదటి ఆస్పత్రి... సిద్ధం చేసిన రిలయెన్స్

                                 భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. 490 కేసులు దాటాయి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL రంగంలోకి దిగింది. కోవిడ్-19 పేషెంట్ల కోసం భారతదేశంలో మొదటి ఆస్పత్రిని సిద్ధం చేసింది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్-BMC సహకారంతో సర్ హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కోవిడ్ 19 ఆస్పత్రిని నిర్మించింది. ఈ ఆస్పత్రికి కావాల్సిన నిధుల్ని రిలయెన్స్ ఫౌండేషన్ సమకూర్చింది. ముంబైలోని సెవెన్ హిల్స్‌లో 100 పడకలతో ఉంది ఈ ఆస్పత్రి. పరస్పరం కలుషితం కాకుండా, ఇన్ఫెక్షన్‌ని కంట్రోల్ చేసేందుకు నెగిటీవ్ ప్రెజర్ రూమ్ కూడా ఉంది. ఈ ఆస్పత్రిలో కరోనా వైరస్ పాజిటీవ్ పేషెంట్లకు చికిత్స అందిస్తారు. ఈ ఆస్పత్రిలో 100 బెడ్స్‌కి కావాల్సిన వెంటిలేటర్స్, పేస్‌మేకర్స్, డయాలిసిస్ మెషీన్, పేషెంట్ మానిటరింగ్ డివైజ్‌లు ఉన్నాయి.

ఇక సర్ హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో క్వారెంటైన ట్రావెలర్స్‌కి ప్రత్యేకమైన సదుపాయాలున్నాయి. ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు ఐసోలేషన్ ఏర్పాట్లున్నాయి. ఇక పలు ఎన్‌జీఓలతో కలిసి ఉచితంగా భోజనాన్ని అందిస్తోంది రిలయెన్స్ ఫౌండేషన్. మహారాష్ట్రలోని లోధివలిలో ఐసోలేషన్ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.



No comments:

Post a Comment