Monday, March 13, 2017

ఎయిర్‌టెల్‌ బాటలో ఐడియా .....!



న్యూదిల్లీ:  రిలయన్స్‌ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఇతర మొబైల్‌ సంస్థలు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దేశీయంగా రోమింగ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఇది వరకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐడియా సెల్యులార్‌ కూడా అదే బాటలో పయనిస్తోంది. రోమింగ్‌లో ఉన్నప్పుడు ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు ఎలాంటి ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో పాటు అంతర్జాతీయ రోమింగ్‌కు ప్రత్యేక ప్యాక్‌లను ప్రకటించింది.

                                          ‘ఏప్రిల్‌ 1 నుంచి 20 కోట్ల మంది ఐడియా వినియోగదారులు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను రోమింగ్‌లో ఉన్నప్పుడు ఇకపై ఉచితంగా పొందవచ్చు’ అని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లలో దేశంలో ఎక్కడి నుంచైనా ఇకపై సాధారణ ఛార్జీలకే కాల్స్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఆపై డేటా ఛార్జీలు కూడా సొంత సర్కిల్‌లో ఉన్నవే దేశవ్యాప్తంగా వర్తిస్తాయని తెలిపింది. డేటాకు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. ఇది ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకూ వర్తిస్తుందని ప్రకటించింది.
అంతర్జాతీయ రోమింగ్‌ కోసం ప్రత్యేక ప్యాక్‌లను తీసుకొచ్చింది. ఆసియాలో రూ.2,499, యూరప్‌ దేశాల్లో అయితే రూ.5,999 రీఛార్జి చేసుకోవడం ద్వారా 400 నిమిషాల ఔట్‌గోయింగ్‌ కాల్స్‌తో పాటు, 100 ఎస్సెమ్మెస్‌లు, 3జీబీ ఇంటర్నెట్‌తో పాటు అపరిమిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌ పొందొచ్చని తెలిపింది. ఈ ప్యాక్‌లకు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని పేర్కొంది.

No comments:

Post a Comment