Thursday, March 2, 2017

జీమెయిల్‌ సైజు పెరిగిందహో..!




Prince Manu : ఎన్ని విన్నపాలు వచ్చినా.. ఎన్ని కష్టాలు వచ్చినా జీమెయిల్‌ సైజ్‌( అటాచ్‌మెంట్లతో కలిపి)25 ఎంబీ మించనివ్వలేదు గూగుల్‌. ఇప్పుడు దానిలో కొంత మినహాయింపు ఇచ్చింది. ఇతర మెయిల్స్‌ నుంచి వచ్చే మెయిల్‌ సైజు రెట్టింపు చేస్తున్నట్లు జీమెయిల్‌ ప్రకటించింది. దీనిప్రకారం ఇప్పుడు మెయిల్‌లో 50ఎంబీ ఫైల్స్‌ను కూడా పొందవచ్చు. ఇక గూగుల్‌ నుంచి పెద్ద సైజు ఫైల్స్‌ను షేరు చేసుకోవాలంటే ‘డ్రైవ్‌’ అప్లికేషన్‌ను వాడుకోవాలని తెలిపింది. ఇది ఇప్పటికే జీమెయిల్‌తో కలిసి పనిచేస్తోంది. దీంతో భారీ ఫైల్స్‌ను కూడా దీని నుంచి పంపించే వీలుంది. కానీ మెయిల్స్‌ పొందే సమయంలో గతంలో 25ఎంబీనే పరిమితి ఉండటంతో ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు దానిని కొంత పెంచడంతో జీమెయిల్‌ వినియోగదారులకు వెసులుబాటు లభించింది.
ఇటీవల జీమెయిల్‌ హఠాత్తుగా సైన్‌అవుట్‌ అవుతోందని పలువురు వినియగదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై గూగుల్‌ స్పందిస్తూ.. దీనిని పరిశోధిస్తున్నామని చెప్పింది. ఇది ఖాతా భద్రత, ఫిషింగ్‌ దాడులకు సంబంధించిన అంశం కాదని తెలిపింది.

From .eenadu 

No comments:

Post a Comment